పిల్లల పుస్తక ప్రపంచం - మంచి పుస్తకం
చక్కని పుస్తకాలను తెలుగులో పిల్లలకు చేరువలోకి తీసుకురావటం కోసం ’మంచి పుస్తకం’ బుక్ ట్రస్ట్ గత ఎనిమిది సంవత్సరాలుగా క్రుషి చేస్తూ ఉంది. దీని వెనుక అనేక మంది మిత్రుల సహాయ సహకారాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. హైదరాబాదు బుక్ ఫెయిర్‘లో ఆరు సంవత్సరాలుగా మొదలయిన పయనం ఇప్పుడు అనేక పుంతలు తొక్కుతోంది. ’సరదాగా పుస్తకాల అమ్మకం’, ’చదవడానికి ఓ మంచి పుస్తకం’ తోపాటు పిల్లల పుస్తకాల జాబితా ప్రచురించి పుస్తక ప్రోత్సాహానికి ’మంచి పుస్తకం’ నడుం కట్టింది. ఈ కాలంలో తెలుగులో పిల్లల పుస్తకల ప్రచురణలో గణనీయమైన ప్రగతిని చూశాం. ఈ ప్రయత్నంలో మంచి పుస్తకం తన వంతు పాత్ర వహించడం మాకు ఆనందంగా ఉంది.
చిన్నపిల్లలకు వారి మాత్రుభాషా వాతావరణం కల్పించాల్సిన ప్రాముఖ్యాన్ని ప్రపంచంలోని ప్రముఖులైన పిల్లల మనస్తత్వ శాస్త్రవేత్తలందరూ నొక్కి చెబుతున్నారు. పిల్లలతో చిన్నప్పటినుండి తెలుగులో మాట్లాడటంతో పాటు వారికి ఆయా పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. పుస్తకాల ద్వారా వారి సృజనాత్మక ప్రపంచానికి తలుపులు తెరిచిన వాళ్ళం అవుతాం. వారిలో ఆత్మ విశ్వాసాన్ని, పఠనాసక్తిని పెంపొందించిన వాళ్ళం అవుతాం. ఈ ఉద్దేశంతోనే మంచి పుస్తకం పనిచేస్తోంది.
పిల్లల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, కధలు, తెలుగు-ఇంగ్లీషు భాషలలో రంగుల బొమ్మల పుస్తకాలు, సైన్సు పుస్తకాలు ’మంచి పుస్తకం’లో ఉంటాయి. ఇందులో భాగంగా మంచి పుస్తకం బుక్ ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్, నేషనల్ బుక్ ట్రస్ట్, హైదరాబాదు బుక్ ట్రస్ట్, పీకాక్ క్లాసిక్స్ వంటి ప్రచురణకర్తల నుండి ఎంపిక చేసిన పుస్తకాలు కూడా ఈ ప్రదర్శనలో ఉంటాయి. ఈ స్టాల్లో పిల్లల పుస్తకాలే కాకుండా, పిల్లల పెంపకం గురించి, విద్యా బోధన గురించి తల్లిదండ్రులకూ, టీచర్లకూ ఉపయోగపడే పుస్తకాలు ఉంటాయి.ఈ సంవత్సరం ’బొకేలు వద్దు బుక్కులు ఇవ్వండి’ అన్న థీమ్ తో పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. కొత్త సంవత్సరానికి, పుట్టినరోజులకి బహుమతులుగా పుస్తకాలు ఇవ్వటాన్ని మంచి పుస్తకం ప్రోత్సహిస్తోంది. ఎవరికైనా అభినందనలు, శుభాకాంక్షలు తెలియచెయ్యటానికి పుస్తకాలను మించినవి ఉండవు. పాఠశాలల్లో వార్షిక బహుమతులగా కూడా పుస్తకాలు చిరకాలం జ్ఞాపకాలుగా ఉంటాయి. పుస్తకాలు చదవటాన్ని ఆనందదాయకమైన వ్యాపకంగా పిల్లలకు చేద్దాం.
మంచి పుస్తకం
12-13-450, వీధి నెం 1, తార్నాకా, సికింద్రాబాదు 500 017
ఫోను: 094407 46614; www.manchipustakam.in; email: info@manchipustakam.in
నాకు బుల్లి మట్టి ఇల్లు పుస్తకం కావలి సహాయం చేయగలరా
ReplyDeleteనా ఫోన్ నెంబర్ 8978761373