Monday, February 16, 2009

పిల్లలు ఆసక్తి గొలుపుతారు...

’పిల్లలకు పుస్తకాలు పరిచయం చేయండి’ అంటూ ఇంతకు ముందు రాశాను. అదే విషయాన్ని మా శ్రీకాంత్ మేనకోడలు ’అశ్రిత’ (18 నెలలు) చూబిస్తోంది.

ఈ వీడియో ఉన్న లింకు: http://www.youtube.com/watch?v=P-w_KBUiPy8

కొన్ని వేలవేల మంది ఇదే ప్రక్రియలలోంచి ఎదిగి ఉంటారు. కాని ఆ అనుభవాన్ని తొలిసారి పొందిన వారికి, చూసినవారికి అది ఒక నూతన ఆవిష్కారం, పరమానందభరిత ద్రుశ్యం. జీవితంలోని మహత్యం, మాధుర్యాలు ఇవే.

'How Children Learn' అన్న పుస్తకానికి జాన్ హోల్ట్ రాసిన ముందుమాట లోంచి ఈ నాలుగు మాటలతో దీనిని ముగిస్తాను:
’తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశోధించి, దానిని అర్ధం చేసుకోటానికి శిశివులు, పిల్లలు చేసే ప్రయత్నాలను గమనించటంకంటే ఈ ప్రపంచంలో అద్భుతమైనది మరొకటి లేదు. అనేక ప్రదేశాలలో, అనేక సందర్భాలలో పిల్లల్ని నేను గమనించాను. పెద్దవాళ్ళు ఎంతోమంది చెప్పినవాటికంటే, చేసినవాటికంటే పిల్లల మాటలు, చేష్టలు నాకు ఎంతో ఆనందాన్ని, తీవ్ర ఆలోచనలకు ప్రేరణనీ ఇచ్చాయి. చిన్న పిల్లలంటే ఇష్టంలేకపోవటం, వాళ్ళు ఆసక్తికరంగా అనిపించకపోవటం, వాళ్ళ సాంగత్యాన్ని ఆనందించలేకపోవటం నేరం ఏమీకాదు. కాని అలా కానప్పుడు జీవితంలో ఎంతో కోల్పోతాం అనిమాత్రం చెప్పగలను.’


1 comment:

  1. నమస్కారం సురేష్ గారూ
    చిన్నపిల్లలో మాతృభాషపై మమకారం పెంపొందించేందుకు మీరు ప్రచురిస్తున్న తెలుగు పుస్తకాలు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటిని విదేశాలలో ఉన్న తెలుగు వారు ముఖ్యంగా ఇష్టపడతారని నాఅభిప్రాయం.
    వీటిని వాళ్ళు తెప్పించుకొనేందుకు సదుపాయం కలిగిస్తే బాగుంటుంది. దీనిపై ఆలోచన చెయ్యండి
    - దూర్వాసుల పద్మనాభం

    ReplyDelete